telugu navyamedia
క్రీడలు

62 పరుగులకే కుప్పకూలిన కివీస్..

ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న టెస్టు క్రికెట్లో కివీస్ జట్టు 62 పరుగులకే చేతులెత్తేసింది. రెండో టెస్టుమ్యాచులో పట్టుబిగించిన టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లపాలిట కొకరానికి కొయ్యిలా మారారు.

28 ఓవర్ల ఓ బంతికి 62 పరుగులకు న్యూజిలాండ్ ను పరిమితంచేసి టీమిండియా బౌలింగ్ ప్రదర్శనలో సత్తాచాటింది. జేమీసన్ 17 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆతర్వాత కెప్టన్ టామ్ లేథమ్ 10 పరుగులు నమోదు చేశాడు. మిగిలిన వారందరూ తక్కువపరుగులకే పరిమితమయ్యారు.

టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ కు నాలుగు వికెట్లు, మహ్మద్ సిరాజ్ కు మూడు వికెట్లు, అక్షర్ పటేల్ కు రెండు వికెట్లు, జయంత్ యాదవ్ కు ఓ వికెట్ సాధించారు.

IND vs NZ 2021: Kiwis collapse to 62 all out after Ajaz Patel 10-fer in 2nd India vs New Zealand Test

ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ తొలిబంతిని కొట్టబోయిన విల్ యంగ్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ బాటపట్టాడు. అదే ఓవర్లో ఆఖరు బంతికి టామ్ లేథమ్ శ్రేయస్ అయ్యకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్సులో ఆరో ఓవర్ వేసిన సిరాజ్ తొలిబంతికి రాస్ టేలర్ ను బౌల్డ్ చేశాడు. అక్షర్ పటేల్ వేసిన తొమ్మిదో ఓవర్లో తొలిబంతికి డేరీ మిచెల్ ఎల్బీడబల్యూగా వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వేసి 14 ఓవర్లో తొలిబంతికి హెన్రీ నికోలస్ క్లీన్ బౌల్డయ్యాడు.

జయంత్ యాదవ్ వేసిన17 ఓవర్లో నాలుగో బంతిని కొట్టబోయిన రచిన్ రవింద్ర కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 20 ఓవర్లో నాలుగో బంతిని ఎదుర్కోబోయిన టామ్ బ్లండెల్ పూజారాకు దొరికిపోయాడు. అదే ఓవర్లో ఆఖరుబంతికి టిమ్ సౌథీ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ లో 28వ ఓవర్లో ఐదో బంతిని ఎదుర్కొన్న సోమ్ విల్లే సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ బాటపట్టాడు. అక్షర్ పటేల్ వేసిన 29వ ఓవర్లో తొలిబంతికి కేల్ జమీసన్ ధాటిగా ఆడే ప్రయత్నించి శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇవ్వడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

Related posts