లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందడంతో ప్రధాని నరేంద్ర మోదీకి దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మోదీకి టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు.
మీ సారథ్యంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని నమ్ముతున్నట్లు కోహ్లీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీకి సచిన్ టెండూల్కర్‌తోపాటు సెహ్వాగ్, శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
నలుగురు ఎంపీలు గెలవగానే ఊహల్లో విహరిస్తున్నారు: ఉత్తమ్