సబ్ ప్లాన్ నిధులను ‘అమ్మఒడి’కి మళ్లించారని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. గత ఎనిమిది నెలల్లో వైసీపీ మాఫియా పాలనతో పేదల పొట్టలు కొట్టారని మండిపడ్డారు. రేషన్ కార్డులు, పింఛన్ల రద్దుతో 26 లక్షల పేద కుటుంబాల పొట్టలు కొట్టారని, ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు.
అమ్మఒడి పథకం కింద ఒక్కో తల్లి నుంచి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని వైసీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. సబ్ ప్లాన్ నిధులను ‘అమ్మఒడి’కి మళ్లించారని ప్రభుత్వంపై ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టబడులు రాకపోవడంతో నాలుగు లక్షల ఉద్యోగాలను యువత కోల్పోయిందన్నారు.
అమరావతి పై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు