భారత ప్రభుత్వం ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుల్వామా దాడి సూత్రధారి జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ముంబయి దాడుల సూత్రధారి జాకీర్ రెహ్మాన్ లఖ్వి,1993 ముంబయి పేలుళ్లలో కీలక పాత్ర వహించిన దావూద్ ఇబ్రహీంను ఉగ్రవాదులుగా గుర్తిస్తూ కేంద్రం ప్రకటన వెలువరించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ చట్టం(ఉపా) బిల్లును తెచ్చిన నెలరోజుల్లోపే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఈ బిల్లుకు ఆగస్టు 2న రాజ్యసభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
అజార్ ఉగ్రవాద కార్యకాలాపాల్లో పాల్గొంటున్నాడని భారత ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. అందుకే ఉపా చట్టం ప్రకారం ఇతడిని ఉగ్రవాదిగా గుర్తిస్తున్నాం. అదే విధంగా హఫీజ్ సయీద్ కూడా ఇదే కోవలోకి వస్తాడు.. అని ఓ ప్రకటనలో తెలిపింది. వీరి ఆచూకీకి రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసినట్లు పేర్కొంది. ఈ నలుగురినే కాకుండా రాబోయే రోజుల్లో మరికొందరి పేర్లు బయటకు వస్తాయని చెప్పింది. కేంద్రం తెచ్చిన ఉపా చట్టం ప్రకారం ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నా, ఆ చర్యలకు ప్రచారం కల్పించినా, వాటిలో వారి ప్రమేయమున్నా వారిని ఉగ్రవాదిగా ప్రకటిస్తారు. ఈ చట్టానికి సవరణలు చేసిన తర్వాత తొలిసారిగా వీరిమీదే ఉగ్రవాద ముద్ర పడింది.A
సిద్ధార్థ్ నన్ను వాడుకున్నాడు… కానీ… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు