బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తెలుగు తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల “ఎన్టీఆర్ : కథానాయకుడు” చిత్రంలో బసవతారకం పాత్రలో కన్పించిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌లోను నటిస్తుంది. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం సాగరిక ఘోష్ రాసిన “ఇందిరా : ఇండియాస్ మోస్ట్ పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్” పుస్తకం ఆధారంగా రూపొందుతుంది. అతి త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళుతుందని విద్యా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా… విద్యా మ్యాథ్స్ జీనియస్ శంకుతల దేవి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. లేడీ డైరెక్టర్ అను మీనన్ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. ఇంకా “నట్‌కత్” అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. కాగా ఈమెకు నటిగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రాల్లో “కహానీ” ఒకటి. ఓ గర్భవతి తన భర్త కోసం వెతికే క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఎలాంటివి? అనే కోణంలో సినిమా సాగుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో “అనామిక” అనే పేరుతో రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు “కహానీ”కి ప్రీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం. దర్శకుడు సుజోయ్ ఘోష్ ఇప్పుడు ప్రీక్వెల్ కథను సిద్ధం చేస్తున్నాడట. ఇందులో కూడా విద్యాబాలనే నటిస్తారని సమాచారం.
previous post