telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్

AA

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా న‌టిస్తున్న చిత్రం “పుష్ప”‌. ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోవ‌ర్ల సంఖ్య 8 మిలియ‌న్లు దాటేసిన విష‌యం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో సెలెబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం కాగా… తాజాగా అల్లు అర్జున్ గురువారం హైద‌రాబాద్‌లోని త‌న నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్క‌డ ఎప్పుడూ ఉండే సంద‌డి, హంగామా ఇప్పుడు క‌నిపించలేద‌ని నిరాశ‌కు గుర‌య్యారు‌. ఈ విషయాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. “చాలా కాలం త‌ర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. అక్క‌డ ఎలాంటి హ‌రీబ‌రీ లేదు. క‌రోనా వ‌ల్ల ఏర్ప‌డిన ఈ‌ గ‌డ్డు ప‌రిస్థితులు త్వ‌ర‌లోనే అంతం కావాలి” అని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా టీ ష‌ర్టు ధ‌రించి, డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, గ‌డ్డంతో ఆఫీసు ప్రాంగ‌ణంలో దిగిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.

Related posts