telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్జీవీకి అనారోగ్యం… వారిని డిజప్పాయింట్ చేస్తూ వర్మ వీడియో

RGV

ఇటీవలే ‘పవర్ స్టార్’ మూవీతో వివాదాల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ దాన్ని కంటిన్యూ చేస్తూ ‘మర్డర్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా పలు వివాదాల్లో నిలుస్తూ ఫుల్లుగా ఫ్రీ ప్రమోషన్స్ రాబట్టుకుంటోంది. ఇదిలా ఉండగానే నిన్న (ఆగస్టు 9) ఇండియాలో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రకటించారు వర్మ. ఇది ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ అని పేర్కొంటూ దానికి ‘డేంజరస్’ అనే ఆసక్తికర టైటిల్ డిసైడ్ చేసి పోస్టర్ వదిలారు. ఇందులో ‘బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా రామ్ గోపాల్ వర్మకు అనారోగ్యం అంటూ వస్తున్న వార్తలపై రియాక్ట్ అయిన వర్మ స్వయంగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. చేతిలో డంబేల్ పట్టుకొని వర్కవుట్ చేస్తూ తన అనారోగ్యం పట్ల వస్తున్న వార్తలపై స్పందించారు వర్మ. ”నేను అనారోగ్యంగా ఉన్నానని, నాకు కోవిడ్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోందని కొందరు సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. వాళ్లందరినీ డిజప్పాయింట్ చేస్తూ, మీ సంతోషానికి చెక్ పెడుతూ నేను చెప్పేది ఒక్కటే.. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రూపొందిస్తున్నాను. సూపర్ ఫైన్” అన్నారు.

Related posts