telugu navyamedia
రాజకీయ వార్తలు

భవిష్యత్ కోసం కొన్ని కష్టాలు భరించక తప్పదు: ఉపరాష్ట్రపతి వెంకయ్య

Venkaiah-Naidu

దేశ వ్యాప్తంగా వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ ను పొడ గిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం కొన్ని కష్టాలు భరించక తప్పదని వెంకయ్య వెంకయ్య పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని కొనియాడారు. లాక్ డౌన్ 1.0 లో సాధించిన ఫలితాలను కాపాడుకోవడానికి లాక్ డౌన్ కొనసాగించాలని అన్నారు. లాక్ డౌన్ 2.0 నుంచి ఆశించిన ఫలితాలు సాధించడమనేది ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.

కరోనా మహమ్మారి సవాల్ ను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మరింత నిబద్ధతతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరీక్షా సమయంలో మనం చేస్తున్న పోరాటం ఆధారంగానే లాక్ డౌన్ ఎత్తివేత ఆధారపడి ఉంటుందన్నారు. దుర్భరమైన వర్గాల జీవనోపాధి గురించి జాగ్రత్తలు తీసుకుంటానని ప్రధాని హామీ ఇచ్చారని, రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం అవసరమైన చర్యలను కూడా తీసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.

Related posts