telugu navyamedia
తెలంగాణ వార్తలు

మాకు పంజాబ్‌, తెలంగాణ రెండూ సమానమే – కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..

*కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం..
*అన్ని రాష్ర్టాల త‌ర‌హాలోనే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేక‌ర‌ణ‌
*కేంద్రంపై కావాలనే కేసీఆర్‌ దుష్ప్రచారం..
*పంజాబ్ విధాన‌మే తెలంగాణ‌కు అనుస‌రిస్తున్నాం..
*తెలంగాణ టీఆర్ ఎస్ నేత‌లు అబద్ధాలు చెబుతున్నారు..
*పంజాబ్‌, తెలంగాణ రెండు మాకు సమానమే.

కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి రా రైస్‌ సేకరణ జరుగుతోందని వెల్లడించారు. ఢిల్లీలో గురువారం తనను కలిసిన తెలంగాణ మంత్రుల బృందంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌కు అనుసరిస్తోన్న విధానమే తెలంగాణకూ అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు.

రా రైస్‌ కేంద్రానికి ఎంత ఇస్తారని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదని.. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు రా రైస్‌ ఎంత ఇస్తాయో చెప్పాయని కేంద్ర మంత్రి వివరించారు

ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదన్నారు. రా రైస్ ఎంత ఇచ్చినా కొంటామన్నారు. అన్ని రాష్ట్రాల్లో సేకరిస్తున్నట్టే.. తెలంగాణ నుంచి కూడా రా రైస్‌ సేకరిస్తామన్నారు.

పంజాబ్ నుంచి కూడా బియ్యాన్నే సేకరిస్తున్నామని.. నేరుగా ధాన్యాన్ని కేంద్రం సేకరించదని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌, తెలంగాణ రెండు మాకు సమానమే. ఏపీ 25లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిబియ్యం ఇచ్చింది.

తెలంగాణ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న కేంద్ర మంత్రి.. ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. రైతులకు భ్రమలు కల్పిస్తూ కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని పీయూష్ గోయల్ ఫైరయ్యారు. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Related posts