telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అసెంబ్లీ సాక్షిగా ..వీకేంద్రీక‌ర‌ణకే క‌ట్టుబ‌డి ఉన్నాం- సీఎం జ‌గ‌న్‌

*వీకేంద్రీక‌ర‌ణ అంశంపై అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్‌
*వీకేంద్రీక‌ర‌ణ విష‌యంలో వెన‌క‌డుగు వేసేది లేదు..
*ప‌రిపాల‌న‌,అభివృద్ధి, వీకేంద్రీక‌ర‌ణ ప్ర‌క్రియ కొలిక్కి తీసుకోస్తాం..
*అడ్డంకులు ఎదురైనా అదే స‌రైన మార్గం..
*అంద‌రికి మంచి చేసే విదంగా త‌మ ప్ర‌భుత్వం ఉంది..
*హైకోర్టు తీర్పు న్యాయ స‌ల‌హా తీసుకుంటాం..
* హైకోర్టుపై మాకు అత్యంత గౌర‌వం ఉంది..
*అమ‌రావ‌తి ప్రాంతంపై నాకు ప్రేమ ఉంది..అందుకే ఇక్క‌డ ఇల్లు క‌ట్టుకున్నా..
*రాజ‌ధాని నిర్మాణానికి క‌నీసం 40ఏళ్ళు ప‌డుతుంది..
*అమ‌రావ‌తిలోనే శాస‌న‌వ్య‌వ‌స్థ ఉంటుంది..
*భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టే వ్య‌క్తి నాయ‌కుడు కాలేరు….
*విజ‌న్ ఉన్న‌వారే నాయ‌కుడు అవుతారు..
*చంద్ర‌బాబు మూడేళ్ల‌లో ఖ‌ర్చు చేసింది కేవ‌లం 5వేల కోట్లు

మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానం అని సీఎం జగన్ మ‌రోసారి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చట్టాన్నే వెనక్కి తీసుకున్నాం.. వెనక్కి తీసుకున్న చట్టంపై తీర్పు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు.రాజధానిపై వాళ్లంతకు వాళ్లే ఊహించుకుని పెట్టారని జగన్ చెప్పారు.

ఏ వ్యవస్థ అయినా తన పరిధిలో ఉంటే మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉందన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థకి గానీ, న్యాయవ్యవస్థకు గానీ చట్టాలు చేసే అధికారం లేదన్నారు.

వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పందని సీఎం గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మాటలన్నింటికి కట్టుబడి ఉన్నాం అని సీఎం జగన్‌ మరోమారు స్పష్టం చేశారు. వికేంద్రీకరణే మా విధానమని.. రాజధానిపై నిర్ణయం తమ హక్కు, తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

రాజధాని నిర్మాణానికి కనీసం 40 ఏళ్లు పడుతుందన్న జగన్.. అభివృద్ధి చెందిన నగరాలన్నీ కొన్ని దశాబ్దాల్లో ఆ స్థితికి వచ్చాయని చెప్పారు.చంద్రబాబు హయాంలో రాజధానిపై 2016-19 మధ్య రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.

నాకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా.ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాఅని అన్నారు. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుపుతున్నామ‌ని అన్నారు.

వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. వికేంద్రీకరణ అర్ధం.. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆత్మగౌరవం, అందరి ప్రయోజనం ఉంది కాబట్టి ముందుకెళ్తామన్నారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకోవడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడతామని.. వారికి అండగా నిలుస్తామని స్ప‌ష్టం చేశారు.

వికేంద్రీకరణ తప్ప మరో మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. చట్టసభకు సర్వాధికారాలు వున్నాయని.. రాబోయే తరాల కోసమే వికేంద్రీకరణ అని జగన్ చెప్పారు.

 

.

 

 

Related posts