telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మూడు రాజ‌ధానుల‌పై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్‌కు లేదు..

*సీఎం జ‌గ‌న్ రాష్ర్టానికి శ‌నిగ్రహంలా మారారు..
*మూడు రాజ‌ధానుల‌పై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్‌కు లేదు..
*అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి..

రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు సీఎం జగన్ తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం మాట్లాడి, మరోసారి మూడు ముక్కలాటకు తెరదీశారని వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలియని వాళ్లు శాసనసభ్యులుగా ఉన్నారు. చేతనైతే రాజధాని అమరావతి అంశంపై ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోరాలన్నారు.

 మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని ఆయన అన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం మన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

అమరావతిపై ప్రేమ ఉంటే ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా అని.. మంచి మనసు ఉండాలని చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్రానికి ఒక శని గ్రహంలా తయారయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా చట్టాలు చేస్తామంటే కుదరదన్నారు.

నమ్మక ద్రోహం చేసిన మీకు పాలించే హక్కు లేదన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టాలు చేయలేరని ఆయన అన్నారు.

ప్రజల్ని చంపేస్తామని మీరు చట్టం చేయలేరంటూ ఎద్దేవా చేశారు. ఏకపక్షంగా అగ్రిమెంట్ చేసుకోవడానికి వీల్లేదన్నారు.

ఒకసారి రాజధానిని నిర్ణయించిన తర్వాత మార్పు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పని సరి అని చట్టం చెబుతోంది. అలాగే రాజధాని రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఉన్నాయని గుర్తుచేశారు.

Related posts