telugu navyamedia
క్రైమ్ వార్తలు

చదువుకునే యువతులు.. సిగపట్లు…

తల్లిదండ్రులు తమ పిల్ల భవిష్యత్తుకోసం… మంచిగా చదువుకోవాలని, ప్రయోజకులు కావాలని కలలు గనటం… వాటిని సాకారం చేసుకునేందు ప్రోత్సహించడం జగమెరిగిన సత్యం. అయితే పిల్లలు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

పోటీ ప్రపంచంలో చదువే ప్రధానమనే విషయం కళ్లముందే తెలుస్తున్నప్పటికీ… విశాఖజిల్లా అనకాపల్లిలో కాలేజీకెళ్లిన ఇద్దరు యువతులు చదువు విషయంలో పోటీపడలేదు… ఇద్దరమ్మాయిలు ఒకే యువకుడిని ప్రేమించారట.. ఆ యువకుడు తనకే దక్కాలని ఎవరికి వారు వాదించుకున్నారు. వాగ్వాదం తారా స్థాయికి చేరుకుంది.

నడిరోడ్డుపై ఇద్దరూ బరితెగించారు. జుట్లు.. జుట్లు పట్టుకుని కొట్టు్ుకున్నారు. తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించి చదివిస్తే కాలేజీలకు వెళ్లి ప్రేమ పాటలు తప్ప చదువు చదవడం లేదు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్నేహితులు, స్థానికులు చూస్తుండగానే ఈద్దరు అమ్మాయిలు కెకొట్టుకోవడం తో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి ఈ ఇద్దరు విద్యార్థినిలు పై కాలేజ్ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Related posts