తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలోని గాలి గోపురం వద్ద భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనార్ధం నడక మార్గం గుండా వెళుతుండగా.. ఈ విషాదం చోటు చేసుకుంది. విషయం తెలియగానే ఘటనా స్థలానికి పోలీసులు చేసుకున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన బిటెక్ విద్యార్థి రాహుల్ గా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాహుల్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు విషాదంలోకి వెళ్లారు.
previous post