ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు ఎవ్వరైనా ఒకటే.. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.. తాజాగా.. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు.. గత రెండు రోజులుగా ఆయన స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా… పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు ఎమ్మెల్యే.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి.. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాల్సింది అని కోరారు.
next post