telugu navyamedia
క్రీడలు వార్తలు

కపిల్ దేవ్ కు గుండెపోటు …

Kapil-Dev

టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌కు ఛాతినొప్పి వచ్చిందని సమాచారం. శుక్రవారం ఉదయం అస్వస్థకు గురికావడంతో ఆయన దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది. అయితే ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కపిల్‌కి డయాబెటిస్‌ సంబంధ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఛాతినొప్పితో దిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ”ఛాతినొప్పితో కపిల్‌దేవ్‌ గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు యాంజీయోప్లాస్టీ చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ చేస్తాం” అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కపిల్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, మాజీలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ ట్వీట్‌లు చేశారు. దేశానికి ప్రపంచకప్‌ అందించిన తొలి కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ చరిత్ర సృష్టించాడు.

Related posts