telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : చెన్నైకి షాక్ ఇచ్చిన ముంబై బౌలర్లు…

ఐపీఎల్ 2020 లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడకపోవడంతో ఇందులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ కిరణ్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బౌలింగ్ కు వచ్చిన చెన్నైకి ముంబై బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదటి మూడు ఓవర్లలోనే 4 వికెట్లు తీసిన వారు పవర్ ప్లే లోనే మొత్తం 5 వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత ఓవర్లోనే కెప్టెన్ ధోని పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే 43 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకున్న చెన్నై కనీసం 100 పరుగులైన చేస్తుందా.. అని అనుకున్నారు. కానీ ఆ జట్టు ఆల్ రౌండర్ సామ్ కర్రన్ 47 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కానీ చివరి ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. అయితే కర్రన్ అర్ధశతకంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 అరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు తీయగా రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు , నాథన్ కౌల్టర్-నైలు ఒక వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ముంబై 115 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3 వ స్థానంలో ఉన్న ముంబై మొదటి స్థానానికి వెళ్తుంది. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts