telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మ్యారేజ్ బ్యూరో : కేవలం రైతులకు మాత్రమే…

రైతుకుటుబాల వారికి పెళ్ళిళ్ళు కుదరని పరిస్ధితి అనేది అందరికి తెలుసు. అందువల్ల సమాజం నుంచి రైతులు ఎలా దూరమైపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇదే సమయంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా, తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌లో ఉండే ఓ రైతు రైతు మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశారు. ఇది ఒక మ్యారేజ్ బ్యూరో. కానీ అందరికీ పెళ్ళిళ్ళు చేయరు. కేవలం వ్యవసాయం చేసే యువతీ యువకులకే ఈ అవకాశం. దీనిని ఏర్పాటు చేసిన అంజి రెడ్డి మాట్లాడుతూ రైతుకు పిల్లని ఇయ్యాలనే పట్టుదలతో ఈ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశానని ఐదు నుంచి పది ఎకరాల భూమి ఉన్న రైతు కుటుంబంలో వ్యవసాయం చేసుకునే వ్యక్తికి కూడా  పిల్లను ఇయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, ఈ అవమానం నాకూ ఎదురైందని ఆయన అన్నారు. ఉద్యోగం ఉంటేనే పిల్లను ఇస్తం అనడం బాధ అనిపించి ఇలాంటి నమ్మకాల నుంచి మళ్లించి సొసైటీలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రైతు మ్యారేజ్ బ్యూరో పెట్టనని అన్నాడు. రైతు కుటుంబంలో ఉన్న పెండ్లి కానోళ్లకు పెండ్లి సంబంధాలు చూస్తున్నానన్న ఆయన సంబంధాల కోసం వచ్చేవారి దగ్గర నుంచి ఎలాంటి డబ్బూ ఆశించడం లేదని అన్నారు. కేవలం రిజిస్ట్రేషన్‌‌‌‌ ఫీజు కింద ఐదొందల రూపాయలు తీసుకుంటున్నానని తెలిపాడు.

Related posts