telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

స్టాక్‌హౌమ్‌ : … రచయిత్రిని వరించిన .. నోబెల్ పురస్కారం…

writer olga got nobel for 2018-19

పోలెండ్‌ రచయిత్రి ఓల్గా టోక్రాక్‌జక్‌, ఆస్ట్రియన్‌ రచయిత పీటర్‌ హండ్కే 2018-19 సంవత్సరాలకు ప్రతిష్టాత్మక సాహితీ నోబెల్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. జీవితపు సరిహద్దుల ఆవలి ప్రపంచాన్ని ప్రజలకు చూపిన సాహితీ ప్రక్రియకు గాను ఓల్గా 2018 సంవత్సరపు నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారని స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. అదే విధంగా మానవ అనుభవాల నిర్దిష్టతను, హద్దుల అన్వేషణలో తన భాషా చాతుర్యంతో ప్రభావవంతమైన ప్రక్రియలను అందించినందుకు హండ్కెను ఎంపిక చేసినట్లు తెలిపింది.

ఈ శతాబ్ద కాలంలో నోబెల్‌ సాహితీ పురస్కారానికి ఎంపికైన మహిళల్లో ఓల్గా 15వ వారు. ఈ కాలంలో ఈ పురస్కారాన్ని అందుకున్న ఇతర సాహితీవేత్తలందరూ పురుషులే. గత ఏడాది ఈ పురస్కారాన్ని ప్రకటించినప్పటికీ విజేతల ఎంపికలో లింగవివక్ష ఆరోపణలు వెల్లువెత్తటంతో దానిని రద్దు చేశారు.

Related posts