telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీకీ మరో షాక్.. బీజేపీలో చేరిన అంబికా కృష్ణ

ambika krishna

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సోమవారం సాయంత్రం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.

ఏపీలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని అంబికా కృష్ణ స్పష్టం చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబికా కృష్ణను ఆనాటి సీఎం చంద్రబాబు ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ఏపీ ఎఫ్డీసీ పదవికి రాజీనామా చేశారు.

Related posts