telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెస్తున్నాం : కిషన్ రెడ్డి

kishanreddy on ap capital

మెదక్ జిల్లా తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నూతన పరిపాలన భవనాన్ని ఇవాళ ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉండడం వల్ల ఇక్కడ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని.. గతంలో మన దేశంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేయబడిందని పేర్కొన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తున్న…ఇట్లాంటి కేవికేలు మనకు ఎంతో అవసరమన్నారు. మన దగ్గర పండ్ల దుకాణాలలో… విదేశాల్లో పండే పండ్లు అమ్ముతున్నారని.. మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం మనం ఇక్కడ మనకు కావలిసిన పండ్లు పండించుకోవాలని తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మారాలని.. ఆ దిశగా శాస్త్రవేత్తలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.. రైతులు దాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. వ్యవసాయానికి సరిపడ విద్యుత్ నిలువలను కేంద్ర ప్రభుత్వం పెంచిందని.. పరిశ్రమలకు కుడా నిరంతరంగా కరెంట్ ఇస్తున్నామని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెస్తున్నామని… మద్దతు ధర ఇస్తూ వ్యవసాయం ద్వారా రెట్టింపు లాభాలు వచ్చేలా మోడి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు ఎక్కడ ధర ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకొనే అవకాశం కల్పిస్తుంది మోడీ ప్రభుత్వమని గుర్తు చేశారు.

Related posts