telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

స్వచ్ఛ భారత్ వల్ల ప్రతి కుటుంబానికి రూ.53,000 లబ్ధి : బండి సంజయ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ ప్రజలకు గట్టి మేలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి దాదాపు రూ.53,000 లబ్ధి చేకూర్చుతోంది అని ఎంపీ బండి సంజయ్ అన్నారు. అతిసార వ్యాధి సోకకుండా చేయడంలో, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమంపై నిర్వహించిన అద్యయనం వివరాలు సైన్స్ డైరెక్ట్ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధ్య సదుపాయాలను ఉపయోగించుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. వ్యయంపై 2.6 రెట్లు ఫైనాన్సియల్ రిటర్న్, 5.7 రెట్లు సొసైటల్ రిటర్న్ వచ్చినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. స్వచ్ఛ భారత్ వల్ల అకాల మరణాల రేటు కూడా తగ్గినట్లు, ఫలితంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులంతా తమ ఇంట్లోని మరుగుదొడ్డిని ఉపయోగించడం వల్ల సంవత్సరానికి దాదాపు రూ.24,000 ఆదా అవుతోందని తెలిపారు. ఇంటి బయట బహిరంగ మల, మూత్ర విసర్జనకు వెళ్ళే సమయం ఆదా అవుతోందని బండి తెలిపారు.

Related posts