telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు శరత్ బాబు మృతి

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) (72).. సోమవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైద్యుల సూచనతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు.

శరత్‌బాబు పూర్తి పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జులై 31న ఆమదాలవలసలో జన్మించారు. 1973లో రామరాజ్యంతో సినీ రంగ ప్రవేశం చేశారు శరత్‌బాబు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. కేవలం హీరోగానే కాకుండా.. అనేక పాత్రలలో కనిపించి మెప్పించారు.

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి.. సినీప్రియులను అలరించిన అలనాటి నటుడు శరత్‌బాబు… తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు.. లంగ్స్ ఇష్యూతోనూ ఇబ్బంది పడుతున్న ఆయన కొంత కాలంగా చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో… వైద్యుల సూచన ప్రకారం ఈ నెల 20న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్‌కు శరత్‌బాబును షిఫ్ట్‌ చేశారు.

 

Related posts