telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

కుబేరుల జాబితాలో అంబానీ ఆరో స్థానం

mukhesh ambani in forbes top 10

ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఆరోస్థానంలో ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో ఉన్న వారెన్ బఫెట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లను ఆయన వెనక్కినెట్టారు. ఇటీవల బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన ర్యాంకుల్లో 8వ స్థానంలో నిలిచిన ముఖేశ్ కొన్ని రోజుల వ్యవధిలోనే 6వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఆయన నికర సంపద విలువ 68.3 బిలియన్ల నుంచి 72.4 బిలియన్లకు పెరిగింది.

ఇటీవల కాలంలో రిలయన్స్ గ్రూప్ కు చెందిన జియో ప్లాట్ ఫామ్స్ లోకి అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో రిలయన్స్ షేర్ విలువ పెరిగిపోవడమే కాకుండా, ముఖేశ్ అంబానీ ఆస్తి కూడా భారీగా హెచ్చుతోంది. బ్లూమ్ బెర్గ్ రియల్ టైమ్ ర్యాంకింగ్స్ లో ఎప్పట్లాగే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ టాప్ లో కొనసాగుతున్నారు. ఆయన ఆస్తి విలువను 184 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు.

Related posts