telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వర్మ కొత్త సినిమా టైటిల్ .. ‘మట్టి ముంతలో మజ్జిగన్నం’..

varma not ready to leave tdp and tarak

వివాదాల దర్శకుడు వర్మ సినిమా విషయంలోనే కాదు దాని టైటిల్స్ ప్రకటించడంలోనూ దిట్టే..ఆయన ఆ సినిమాలు చేస్తాడో లేదో తెలియదు కానీ ఆయన ప్రకటించిన టైటిల్ మాత్రం వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈయన ‘మట్టి ముంతలో మజ్జిగన్నం’ అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయమై ఆయన్ను మీడియా అడిగితే నాకు తెలియదు..ఒకవేళ తీస్తే మీ మీడియా వారికే అంకితం ఇస్తానని చెప్పి బాంబ్ పేల్చాడు.

ఈ టైటిల్ బట్టి చూస్తేనే ఎవరి గురించో అర్ధం అవుతూనే ఉంది. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ కు సంబందించిన కథే అని అంత మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో పవన్ మట్టి ముంతలో మజ్జిగన్నం పెట్టుకొని తిన్న పిక్స్ బయటకు వచ్చి హల్చల్ చేసాయి. నిజంగా అప్పుడు ఆయన చేసాడో..ఎన్నికల ప్రచారం కోసం అల చేశాడో తెలియదు కానీ, ఆ క్షణం మాత్రం అంత పవన్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు వర్మ దాని నేపథ్యంలోనే ఈ టైటిల్ పెట్టి ఉంటారని చెవులు కోరుకుంటున్న సామజిక మాధ్యమాలు!.

Related posts