telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కరోనా పరీక్షల పై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ…

cm jagan ycp

ఏపీలో రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  కోవిడ్ నిర్ధారణ కోసం చేయించుకునే స్కానింగ్ ధరలను నియంత్రించింది ఏపీ ప్రభుత్వం. సీటీ స్కాన్, హెచ్చార్ సీటీ స్కాన్ ధరను రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులతో పాటు ఆస్పత్రుల్లోనూ సీటీ స్కాన్ నిమిత్తం రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని సూచనలు చేసింది. ప్రభుత్వ ఆదేశాల అమలు విషయంలో నిరంతరం పర్యవేక్షించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ వైద్యారోగ్య శాఖ. స్కానింగ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

Related posts