telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ముచ్చింత‌ల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

* స‌మ‌తా మూర్తిని సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న అమిత్ షా
* ముచ్చింత‌ల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
* రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ధి ఉత్స‌వాల్లో అమిత్ షా..
* చిన‌జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో 108 దివ్య దేశాల‌ను ద‌ర్శించుకుంటున్న అమిత్ షా
* తిరునామం పెట్టుకుని వ‌చ్చిన అమిత్ షా..
* దివ్య క్షేత్రాల విశిష్ట‌త‌ను వివ‌రిస్తున్న చిన‌జీయ‌ర్ స్వామి

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ముచ్చింతల్‌‌లో రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. తిరునామం, పంచెకట్టుతో వచ్చిన అమిత్‌ షా.. స‌మ‌తా మూర్తిని విగ్రహాన్ని దర్శించుకోనున్నారు.

సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. అనంతరం యాగశాలలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

Telangana: PM Modi to unveil Statue of Equality next month: All you need to know about the monument celebrating the timeless legacy of Ramanujacharya | India News

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్‌ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, బిజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఘన స్వాగతం పలికారు.

కాగా..ముచ్చింత‌ల్‌లో ఏడో రోజు రామానుజాచార్యుల సహాస్రాబ్ది ఉత్స‌వ వేడుకలు చినజీయర్‌ స్వామి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. నేడు ర‌థ‌స‌ప్త‌మి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

Related posts