ఏపీ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి శాసన సభ ప్రారంభం కానుండగా, ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు అసెంబ్లీ వ్యవహరించాల్సిన తరుపై వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులపై ఉత్కంఠ నెలకొంది.