telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణా కరోనా అప్డేట్.. 1,983 కేసులు, 10 మరణాలు

corona covid

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజు రోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. అయితే నిన్న పరీక్షలలో సగమే చేయడంతో కరోనా కేసులు భారీగా తగ్గాయి. అయితే ఈరోజు మళ్ళీ కాస్త కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన గణాంకాల మేరకు గడచిన 24 గంటల్లో 50,598 మంది నమూనాలను పరీక్షించగా, 1,983 మందికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,02,594కు చేరుకుంది. శనివారం నాడు కరోనాతో 10 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 1181కు చేరింది. వ్యాధి నుంచి 2,381 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య (1,74,769కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,644 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 21,784 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వైద్యుల సలహాతో చికిత్స తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఇక, ఇప్పటివరకూ రాష్ట్రంలో 32,92,195 కరోనా టెస్ట్ లను నిర్వహించామని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Related posts