telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇప్పటి కంటే ఇంకా దారుణమైన పరిస్థితులు.. కరోనా మీద డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

corona vairus

కొన్ని నెలల నుండి ఆ దేశం ఈ దేశం అని లేకుండా అన్ని దేశాల వారినీ వణికిస్తోంది కరోనా వైరస్. ఏకంగా అగ్రరాజ్య అధినేత ట్రంప్ కూడా ఈ వైరస్ బారిన పడి ఇబ్బందులు పడ్డాడు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వైరస్ మూడున్నర కోట్ల మందికి పైగా సోకింది. అందులో పది లక్షల మంది ప్రాణాలు తీయగా చాలా మంది కోలుకుంటున్నారు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ మొత్తం ప్రపంచమంతటా విస్తరించిందనే చెప్పాలి. ప్రపంచ జనాభాలో ప్రతి పది మందిలో ఒకరు కోవిడ్‌ బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది.

 

ఆయా దేశాల జన జీవనం, అక్కడి గ్రామీణ, నగర ప్రాంతాలను బట్టి దీని ప్రభావం మారుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా మొదలయినప్పటి కంటే మానవాళి ఇప్పుడు మరింత సంక్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నామని ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోందని.. యూరప్‌ సహా ఈస్ట్, వెస్ట్ ఆసియా ప్రాంతాల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అయితే ఇండియా మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన దానికంటే భారత్ సుమారు ఆరు రెట్లు అధికంగా పరీక్షలు నిర్వహించిందని చెబుతున్నారు. ఒక రోజులో పది లక్షల మంది జనాభాకు 140 నిర్ధారణ పరీక్షలు చేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించగా దానికంటే సుమారు ఆరు రెట్లు ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్నామని భారత్ చెబుతోంది.

Related posts