*ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..
*మల్లు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డి కి సంతాపం
తెలంగాణ శాసనసభ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు మంగళవారం ఉదయం 11.30 ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో దివంగతులైన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి), పరిపాటి జనార్దన్‌రెడ్డి (కమలాపూర్)కి సంతాపం ప్రకటించింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది.కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగుతుంది.