telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఆ ఆకులు తిన్న మేక .. ఇంటి యజమానికి భారీ జరిమానా..

house owner got penalty on goat ate leaves

ఇటీవల బాగా వినిపిస్తున్న పదం జరిమానా…కొత్త వాహన చట్టం అరకొర వాహనాలతో నెట్టుకొస్తున్న సామాన్యులపై కొరడాలా మారింది. ఈ జరిమానాలు వారి వాహనం కంటే ఖరీదైనవి కావటమే అందుకు కారణం. కానీ, ప్రమాదాలు లేకుండా అందరూ సురక్షితంగా వారివారి గమ్యాలకు చేరుకోవాలని ప్రభుత్వం వాహనచట్టం మరింత కఠినతరం చేసింది. ఇది ఒక తరహా జరిమానా అయితే, ఇక ప్రభుత్వం లక్షల మొక్కలను నాటి వాటిని రక్షించాలని భారీగా ప్రచారం కూడా చేస్తుంది. లేని పక్షంలో జరిమానాలు తప్పవని హెచ్చరించింది. నగరాలలో పెరిగిపోతున్న కాలుష్య నివారణ మార్గంలో భాగంగా మొక్కలు ;నాటే కార్యక్రమం చేపడుతుంది ప్రభుత్వం. వాటి రక్షణపై కూడా అంతే కఠినంగా ఉన్నామని తాజాగా జరిగిన సంఘటన స్పష్టం చేస్తుంది. వివరాల ప్రకారం ఓ మేక ఆకులు తినేసిందని 10వేల జరిమానా విధించారు.

ఆ మేక చేసిన తప్పు ఏంటంటే హరితహారం చెట్ల ఆకులను తినడం. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలో జరిగింది. ఉప్పర్‌ పల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తిన్నాయి. సరిగ్గా అదే సమయంలో గ్రామ పర్యటనకు వచ్చిన కలెక్టర్ మేకలు మొక్కలను తినడాన్ని చూసి, యజమానికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎంపీడీవో ఒకేసారి ఆ మేకల యజమానికి 10వేల రూపాయిలు జరిమానా విధించారు. కాగా ఎంపిడివో వివరణ ఇస్తూ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే జరిమానా విధించినట్లు తెలిపారు.

Related posts