telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఆ మహనీయుని వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది -కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్, సారంపల్లి, అంక్సాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ వచ్చిందని, ఆయన లేకపోతే అది సాధ్యపడేది కాదన్నారు.

ఇవాళ నేను మంత్రిగా మీముందున్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే… కేసీఆర్ నేతృత్వంలోని పోరాటం ఒకవైపు అయితే… అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద‌ని కేటీఆర్ అన్నారు.

బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే అన్నారు. ప్రపంచంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైద్రాబాద్ లో పెట్టబోతున్నామన్నారు.

బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు. దేశంలో.. ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. 10 లక్షలు దళిత బంధు ద్వారా దళితులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక్కటే అన్నారు మంత్రి కేటీఆర్.

అంబేద్కర్ చూపించిన దారిలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వెళుతుంద‌ని అన్నారు. దళిత బంధు విజయ వంతం అయితే భారత దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంద‌ని అన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కేంద్రం అరాచక పాలన సాగిస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. ఉన్నవి రెండు కులాలు ఒక పేద వాడు రెండవ వాడు ధనికుడు మాత్రమే. ఏ దేవుడు చెప్పడు , దేవుడి పేరు మీద గొడవలు పొట్టుకోమనీ. శ్రీరామ నవమి రోజున కొన్ని రాష్ట్రాల్లో గొడవలు జరిగాయి.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, వ్యవస్థలను అడ్డుపెట్టు కొని మోడీ రాజకీయ ప్రత్యర్థులపై వేటకుక్కల మాదిరిగా ఉసి గొల్పుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు.

 

Related posts