*ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోఈడీ యాక్షన్
*దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల దాడులు..
*హైదరాబాద్‌లోనూ ఆరు చోట్ల ఈడీ సోదాలు
*మనీ ల్యాండ్రింగ్ వ్యవహారం కేసులో సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 32 చోట్ల ఈడీ మెరుపు దాడులు చేపట్టింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ వ్యవహారంపై కేసుకు సంబంధించి ఈడీ హైదరాబాద్ సహా ప్రధాన నరగాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.
ఢిల్లీ, లక్నో, గుర్గావ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లోనూ ఈడీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్‌లో ఆరుచోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది.
హైదరాబాద్‌లో అరుణ్ రామచంద్రన్‌పిళ్లైతో సహా మరో అయిదుగురికి సంబంధించిన కంపెనీతోపాటు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలో సహా రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
రాబిన్ డిస్టిలర్స్ పేరుతో అరుణ్ రామచంద్రన్ పిళ్లై వ్యాపారం నిర్వహిస్తున్నారు.బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో వ్యాపార కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. రామచంద్రన్‌కు చెందిన ప్రధాన కార్యాలాయంతోపాటు ఇంట్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.
సెక్రటేరియట్‌కు మరో 70 ఏళ్ల పాటు ఢోకా లేదు: వీహెచ్