విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం బాధాకరమన్నారు.క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని ఆయన అన్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కరోనా చికిత్సా కేంద్రంలో అగ్నిప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడానిక గురించి తెలుసుకుని షాకయ్యానని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
బీసీలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించారు: యనమల