గుడిలో పూజలు చేస్తూ భక్తి సూక్తులు బోధించే ఓ పూజారి ఎనిమిదో తరగతి బాలికతో ప్రేమాయణం కొనసాగించాడు. ఏడాదిగా బాలికకు మాయమాటలు చెబుతూ లైంగిక దాడి చేస్తున్న సిద్దిపేటలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన పూజారి ఆమెతో సన్నిహితంగా గడిపి, ఇందుకు సంబంధించిన ఫొటోలనుతీశాడు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో చివరకు పూజారి మహేందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఆ బాలిక ఫొటోలను వాట్సప్ గ్రూపుల్లో వైరల్ చేశాడని పోలీసులు గుర్తించారు. వాటిని చూసిన ఆ బాలిక తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.