telugu navyamedia
క్రీడలు వార్తలు

క్రికెట్‌లో నాణ్యత దారుణంగా పడిపోయింది: షోయబ్ అక్తర్

England & Pakistan Nets Session

క్రికెట్‌లో నాణ్యత దారుణంగా పడిపోయిందని పాకిస్థాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో క్రికెట్ నాణ్యత లోపించడం తనను తీవ్ర నిరాకు గురిచేస్తోందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్స్‌లో చోటు ఖాయం చోటు ఖాయం చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో అక్తర్ తన యూట్యూబ్ చానెల్‌లో స్పందిస్తూ..పరుగులు స్కోర్ చేయడం మంచినీళ్లు తాగినంత సులభంగా మారిపోయిందన్నారు. బౌలర్లకు ఏమాత్రం నాణ్యత లేదని వ్యాఖ్యానించారు. 1990, 2000ల కాలంలో ఉన్న మాదిరిగా పేస్, స్పిన్ బౌలర్లకు బౌలింగ్‌లో నాణ్యత లేదు. దీనికి తోడు మూడు పవర్‌ప్లేలు, రెండు కొత్త బంతులతో పరుగులు చేయడం మరింత సులభంగా మారిందని పేర్కొన్నాడు.

Related posts