బీజేపీ ఎంపీ సుజనా చౌదరి భార్య పద్మజకు డీఆర్టీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు తమ ముందు విచారణకు రావాలని ఆదేశించింది. చెన్నైకి చెందిన ఐడీబీఐ బ్యాంకు శాఖ నుంచి పద్మజ రూ. 169 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. , తీసుకున్న లోన్ తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారన్నది బ్యాంకు అధికారుల ఆరోపణ.
ఈ విషయంలో గతంలో పలుమార్లు నోటీసులు పంపినా ఆమె స్పందించలేదని బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. కాగా, పద్మజతో పాటు సుజనా యూనివర్సల్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ కు చెందిన శ్రీనివాసరాజు, ఎస్టీ ప్రసాద్, ఆయన భార్య ధనలక్ష్మి, సుజనా కేపిటల్ సర్వీస్ లిమిటెడ్, ఎక్స్ ప్లెయిర్ ఎలక్ర్టికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా హాజరు కావాలని డీఆర్టీ నోటీసులు ఇచ్చింది.