ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక కూడా అవసరం అనుకుంటే రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందన్నారు.
వీవీ ప్యాట్ స్లిప్పులో తేడా వచ్చినప్పుడు, ఈవీఎం డీకోడ్ కానప్పుడు, ఈవీఎంలు మొరాయించినప్పుడు, పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగా ఉన్నప్పుడు రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని ద్వివేది స్పష్టం చేశారు.
ఈ నెల 18న 20 వేల మంది బీజేపీలో చేరుతారు: లక్ష్మణ్