telugu navyamedia
వార్తలు సామాజిక

పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యం.. సోషల్ మీడియాలో విద్యార్థుల ప్రచారం!

exam hall

పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యమని కర్ణాటక విద్యార్థులతో పాటు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఓ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆరంభించారు. కాలేజీ, యూనివర్శిటీ స్థాయి పరీక్షలను బ్యాన్ చేయాలంటూ ‘ప్రమోట్ స్టూడెంట్స్ సేవ్ ఫ్యూచర్స్’ హ్యాష్ ట్యాగ్ తో తమకు ఎగ్జామ్స్ వద్దని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా మహమ్మారి మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు కూడా ఇదే విధమైన సౌలభ్యం తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లను చేస్తున్న సమయంలో, ఆ ఏర్పాట్లు తమలో ధైర్యాన్ని పెంచడం లేదన్నది విద్యార్థుల అభిప్రాయం. తమకు వైరస్ సోకవచ్చన్న భయాందోళనతో ఉన్న విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేమని అంటున్నారు.పరీక్షలు ముఖ్యం కాదని, మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో సమస్యలను కొని తెచ్చుకోవడం ఎందుకని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.

Related posts