శ్రీ షిరిడిసాయి మూవీస్ పతాకంపై అనేక సినిమాలను నిర్మిస్తున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాజశేఖర్ రెడ్డి యం. మే30 ఆయన పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ–‘‘ రెండురోజుల క్రితం నా బ్యానర్, నా స్నేహితుడు శర్వాంతరామ్ క్రియేషన్స్ అధినేత జవ్వాజి రామాంజనేయులుతో కలిసి జియో సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డైరెక్ట్‌గా విడుదల చేసిన చిత్రం ‘భూ’. లాక్‌డౌన్లో మా దర్శకుడు విజయ్‌కి వచ్చిన ఓ చిన్న ఆలోచనని పెద్దగా ఆలోచించి టాప్ స్టార్స్‌ని రంగంలోకి దించి చేసిన చిత్రమే ‘భూ’. ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలైన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకోవటం నా ఈ పుట్టినరోజుని ఎంతో స్పెషల్‌గా గుర్తుంచుకునే రోజులా మార్చింది. ఈ విజయానికి కారణమైన దర్శకుడు ఏ.యల్ విజయ్‌తో పాటు నాతో పాటు పనిచేసిన టీమ్‌కి థ్యాంక్స్ చెప్తున్నాను.
అలాగే మా సినిమాలో నటించిన ప్రముఖ నటుడు విశ్వక్‌సేన్ హీరోయిన్లు రకుల్‌ప్రీత్, నివేధా పేతురాజ్, మంజిమా మోహన్, రెబ్బజాన్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు. అతిత్వరలో నా బ్యానర్ షిరిడిసాయి మూవీస్ నుండి అరుణ్ విజయ్, అమీ జాక్సన్ జంటగా నటించిన థ్రిల్లర్ సినిమా ‘మిషన్–1’ పాన్‌ఇండియా సినిమాగా లైకా ప్రొడక్షన్స్ వారు విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది. దాదాపు 30 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమా టీజర్‌ను చూసి అందరూ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉన్నాయి విజువల్స్ అంటే చాలా ఆనందపడ్డాను. అలాగే విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, అక్షర హాసన్ తదితర ప్రముఖ నటీనటులు నటించిన ‘జ్వాలా’ బైలింగ్విల్ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జ్వాలా’ సినిమాతో నవీన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర, కార్తీక్ రత్నం, అమృత అయ్యర్, వాణీభోజన్‌లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రానికి నూతన దర్శకుడు వాలీ మోహన్‌దాస్‌ను పరిచయం చేస్తూ మంచి ఎమోషనల్ కంటెంట్‌ను ద్విబాషా చిత్రంగా తెరకెక్కించాను. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇలా అనేక సినిమాలతో బిజీబిజీగా ఉండటంతో ఈ పుట్టినరోజు నాకు ఎంతో ప్రత్యేకమని నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. నా ఈ సినిమా జర్నీలో నాకు ఎంతో సహకరిస్తున్న నా ఫ్యామిలీకి, స్నేహితులకు అందరికి ధన్యవాదాలు ’’ అన్నారు.
వ్యవస్థ మారనంత కాలం రాజకీయ పెత్తనం: ప్రొఫెసర్ నాగేశ్వర్