తెలంగాణలో పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్కువ సమయంలోనే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏడు పోలింగ్ బూత్ లలో ఇబ్బందులు ఎదురయ్యాయని అందుకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోందన్నారు.
ఈనెల 27న కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. 123 ప్రాంతాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని.. ఒక్కో ఎంపీటీసీకి రెండు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 32 జిల్లాలలో 123 కేంద్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మూడు విధాలుగా జరుగుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు.