ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రామలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడవ సారి ఆయన ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
కేజ్రీవాల్‌తో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీకి మద్దతుగా నిలిచిన సామాన్యులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపాల్స్, కరిక్యూలమ్ కోఆర్డినేటర్స్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులను ఆహ్వానించారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో సహా ఆప్ నేతలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
లోకేశ్ ఓటమికి చంద్రబాబే పరోక్ష కారకులు : ఆళ్ల రామకృష్ణారెడ్డి