telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాబు, అచ్చెన్నాయుడు, సుజనాలు జైలుకు వెళ్లడం చూడాలని ఉంది: లక్ష్మీపార్వతి

laxmi parvathi ycp

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి.. ఈ ముగ్గురూ జైలుకు వెళ్లడం చూడాలని ఉందని చెప్పారు. తన భర్త ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో చంద్రబాబునాయుడుపై ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో వాటి గురించి ఆమె ప్రస్తావించారు.

మళ్లీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబును అండమాన్ జైలుకు పంపించాలని ఉందని తనతో అనేవారని గుర్తుచేసుకున్నారు. చంద్రబాబుకు ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ గత పాలనపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అన్ని వాస్తవాలు బయటకొస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. ప్రాచీన తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొస్తామని లక్ష్మీపార్వతి చెప్పారు. తెలుగు సాహిత్య పీఠాన్ని విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.

Related posts