telugu navyamedia
రాజకీయ

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గ‌మ‌నిక‌..!

రైల్వే ప్రయాణికులకు ముఖ్య విజ్ఞ‌ప్తి.. నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్‌ సేవలతో పాటు.. పలు సేవలకు తాతాల్కికంగా బ్రేక్‌ పడనుంది.. ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టంలో డిజాస్టర్‌ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్న కారణంగా.. టికెట్ బుకింగ్ చార్టింగ్, కరెంట్‌, పీఆర్‌ఎస్‌ ఎంక్వైరీ, టికెట్‌ రద్దు, చార్జీలు రీఫండ్‌ తదితర పీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోతాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఇవాళ రాత్రి 11.45 గంటల నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు.. ఈ సేవలకు అంతరాయం కలుగుతుందని.. తిరిగి 22వ తేదీన రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు సేవ‌లు నిలిచిపోతాయ‌ని అధికారులు వెల్లడించారు. ఆయా సమయాల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్‌ చార్టులు, కరెంట్‌ బుకింగ్‌ చార్టులు ముందుగానే సిద్ధం చేస్తామని తెలిపారు అధికారులు.

పీఆర్‌ఎస్‌ విచారణ ప్రస్తుత బుకింగ్ పీఆర్‌ఎస్‌ కౌంటర్లలో మాన్యువల్‌గా నిర్వహించబడుతుంది. ఈ మేరకు ప్రయాణికులు ఏదైనా అసౌకర్యానికి లోనైతే సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.

కాగా ..కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో చాలాకాలంపాటు నిలిచిపోయిన రైల్వే సేవలు ఇప్పుడిప్పుడే  పునరుద్ధరించబడుతున్నాయి. ఈ క్రమంలో అక్కడక్కడ పలు సేవల్లో అంతరాయం కలుగుతోంది.

Related posts