అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కాబుల్ విమానాశ్రయ సమీపం నుంచి 150 మంది పౌరులను తాలిబన్లు అపహరించినట్లు సమాచారం. అఫ్గాన్ నుంచి ఇతర దేశాలకు తరలింపునకు సిద్ధంగా ఉన్నవారిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న 150 మందికి పైగా భారతీయులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. వీరందరని తాలిబన్లు శనివారం కాబుల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కిడ్నాప్ చేశాసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాబుల్‌లోని భారత ఎంబసీకి చెందిన ఓ అఫ్గన్ ఉద్యోగి వెల్లడించారు. తాలిబన్లు కిడ్నాప్ చేసిన వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు సమాచారం. తాలిబన్ల చెరలో ఉన్న భారతీయులకు తక్షణ ప్రమాదం ఏం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ వెంటనే అప్రమత్తమైంది.
భారతీయులను తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ ఒకరు ట్వీట్ చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ చేసిన భారతీయులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. భారత వైమానిక విమానం సీ-130 కాబుల్ నుంచి కొద్ది గంటల క్రితం 85 మంది భారతీయుల్ని తరలించింది. ఆ విమానం తజకిస్థాన్‌లోని దుషన్‌బేలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అపహరణ గురించి వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు సమాచారం: లోకేశ్