telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆడకపోయిన మొత్తం జీతం తీసుకుంటున్న అయ్యర్…

ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడి… సర్జరీ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ మొత్తానికీ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఆడే సిరీసులకు కూడా అతడు అందుబాటులో ఉండడని టీమిండియా ఫిజియో చెప్పారు. అయితే శ్రేయాస్ ఐపీఎల్ 2021 ఆడనప్పటికీ.. అతనికి రూ.7 కోట్ల రూపంలో పూర్తి వేతనం రానుంది. దానికి కారణం 2011లో బీసీసీఐ తీసుకొచ్చిన ప్లేయర్ ఇన్సూరెన్స్ పాలసీనే అసలు కారణం. ఈ ప్లేయర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఓ ప్లేయర్ గాయం, యాక్సిడెంట్‌ కారణంగా ఐపీఎల్‌ టోర్నీకి దూరమైతే.. అతనికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి. అయ్యర్ ఒక కాంట్రాక్ట్ కలిగిన ఆటగాడు. అంతేగాక టీమిండియా తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆడుతూ అతడు గాయపడ్డాడు. అందుకే శ్రేయాస్ ఈ పరిహారం పొందేందుకు పూర్తి అర్హుడు. ఈ ఏడాది భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్‌ ఉంది. అయ్యర్ వేగంగా కోలుకుంటేనే.. మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కుతుంది. అయితే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్‌ స్థానంలో యాజమాన్యం కొత్త సారథిగా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్ ను ప్రకటించిన విషయం తెలిసిందే‌.

Related posts