telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో మరికొన్ని మ్యాచ్ లకు దూరంకానున్న పంత్…

ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లు అందరూ దాదాపు ఆరు నెలలు క్రికెట్ కు దూరంగా ఉన్నారు. దాంతో ఈ ఐపీఎల్ సీజన్ లో ఆటగాళ్లు ఎక్కువగా గాయాలబారిన పడే ఆవకాశం ఉన్నట్లు మాజీలు ముందుగానే చెప్పారు. అయితే వారు చెప్పినట్టుగానే ఐపీఎల్ లో ప్లేయర్స్ గాయాల బారిన కొన్ని మ్యాచ్ లకు దూరం అవుతున్నారు. కానీ అది ఎక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఆటగాళ్లను మాత్రమే ఈ గాయాలు వెంబడిస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టులో మొదట ఇషాంత్ శర్మ ఆ తర్వాత అశ్విన్ గాయాల కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరం అయ్యారు. ఇక అందులో అశ్విన్ మళ్ళీ తిరిగి జట్టులోకి వచ్చాడు కానీ ఇషాంత్ ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఢిల్లీ వికెట్ కీపర్ కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు తెలుస్తుంది. అప్పటికే అతను ఢిల్లీ ముంబై తో ఆడిన గత మ్యాచ్ లో పాల్గొనలేదు. ఇక పంత్ గాయం తీవ్రమైంది అని తెలుసుకున్న ఢిల్లీ యాజమాన్యం నియమాల ప్రకారం అతని స్కానింగ్ రిపోర్ట్ బీసీసీఐ కి పంపించింది. ఇక మరి పంత్ ఇంకా ఎన్ని మ్యాచ్ లకు దూరంగా ఉంటాడు అనేది తెలియదా కానీ అతని దూరం ఢిల్లీ కి పెద్ద నష్టమే అని చెప్పాలి.

Related posts