telugu navyamedia
సినిమా వార్తలు

టీజర్లో న్యూడ్ గా అమలా పాల్… వర్మ రియాక్షన్ ఇదీ

Amalapaul

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ కొంత సేపటి క్రితమే విడుదలైంది. టీజర్ చివర్లో అమలాపాల్ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కన్పించి అందరికీ షాకిచ్చింది. ఈ టీజర్ పై, టీజర్లో అమలాపాల్ నటనపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సమంత ఈ టీజర్ పై ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేసింది. ఇప్పుడు సెన్సేషనల్ గా మారిన ఈ టీజర్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆమె నగ్నత్వంలో నిజాయితీ తన హృదయానికి హత్తుకుందంటూ ట్వీట్ చేశారు. ఈ టీజర్ లింక్ ను తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ అమాలపాల్, దర్శకనిర్మాతలపై ప్రశంసలు కురిపించాడు.

Related posts