telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : వీళ్ళు క్వారంటైన్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి….!

MEB

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌ కాంబినేషన్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా మా బ్యాచిలర్ & బ్యాచిలరెట్ క్వారంటైన్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ పోస్టర్ లో మన బ్యాచిలర్ అఖిల్ అక్కినేని సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ లాప్ టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటుండగా.. అతని బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్న పూజాహెగ్డే తన కాలితో అఖిల్ చెవిని తాకిస్తూ అతడిని దిస్తుర్బ్ చేస్తోంది. ఇక అఖిల్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని, వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ లిరికల్ ‘మనసా మనసా’ అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ విశేష ఆదరణ పొందాయి.

Related posts