telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

వామ్మో మహిళలలో కూడా .. ఇంత పోటీనా.. 100 ఖాళీలకు 2లక్షల దరఖాస్తులట..

huge competition on women aslo 2laks for 100 jobs

ఇటీవల కేంద్రం రక్షణ దళాల్లోకి మహిళల ప్రవేశానికి సై అనటంతో ఆ రంగం పట్ల మహిళలు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటన … వంద మహిళా జవాన్ల పోస్టులకు రెండు లక్షల మందికిపైగా మహిళలు దరఖాస్తు చేసుకోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళలను రక్షణ రంగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత తొలిసారి ఆరుగురు మహిళలు భారత వాయుసేనలో చేరారు. ప్రస్తుతం వారు ఫైటర్ పైలట్లుగా శిక్షణ పొందుతున్నారు.

కార్ప్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ (సీఎంపీ)లో వంద జవాన్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆశ్చర్యకరంగా రెండు లక్షల మందికిపైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. మహిళా ప్రొవొస్ట్ యూనిట్’లను పెంచుకునేందుకు సైన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో ఇద్దరు అధికారులు, ముగ్గురు జూనియర్ కమిషన్డ్ అధికారులు, 40 మంది జవాన్లు ఉంటారు. ఇందుకు సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్మీలో అధికారి స్థాయిలో మాత్రమే మహిళలు ఉన్నారు. వీరిని యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ సేనలకు దూరంగా ఉంచుతున్నారు.

Related posts